విద్యారణ్యపురి: హనుమకొండలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ (ఇన్‌చార్జ్ హెచ్‌ఎం)గా పనిచేస్తున్న సువార్త రత్నను సస్పెండ్ చేసినట్లు మంగళవారం డీఈఓ అబ్దుల్ హై తెలిపారు. పాఠశాలలో మధ్యా హ్న భోజనం బియ్యం నిల్వలు అధికంగా ఉన్నాయనే అరోపణల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ఎంఈఓ వేర్వేరుగా తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్‌కు,బియ్యం నిల్వలకు సంబంధించి 10 క్వింటాళ్ల 50 కిలోలు అధికంగా ఉన్నట్లు గుర్తించా రు. ఎంఈఓ రాంకిషన్ రాజు ఇచ్చిన నివేదిక అధారంగా సువార్త రత్నను సస్పెండ్ చేశారు.