
పుస్తకాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్ ప్రావీణ్య, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి
వరంగల్ రూరల్: లీడ్ బ్యాంక్ మేనేజర్, యూబీఐ సహాయంతో రెండు జిల్లాల పరిధిలోని 9 గ్రామ గ్రంథాలయాలకు రూ.87,800 విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి పంపిణీ చేశారని కలెక్టర్ పి.ప్రావీణ్య వెల్లడించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీసీసీబీ రూ.20వేలు, యూబీఐ రూ.15వేలు, ఎస్‌బీఐ రూ.10వేలు, కెనరా బ్యాంక్ రూ.10వేలు, ఏపీజీవీబీ రూ.5వేల చొప్పున అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లీడ్ మేనేజర్ రాజు హవేలి, వివిధ బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.