
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిలో పాల్గొనేందుకు ఈ ఏడాది వినూత్నంగా క్యూఆర్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయనున్నారు. ప్రతి ఏడాది ఈ–మెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్‌లలో విద్యార్థులు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తుండగా.. ఈసారి స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం స్ప్రింగ్‌స్ప్రీ–23లోకి ప్రవేశించి ఎంజాయ్ చేయండి అంటున్నారు నిర్వాహకులు.