
వరంగల్ పిన్నావారి వీధిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్ చౌరస్తా: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కులాల మధ్య చిచ్చుపెట్టి ఎమ్మెల్యే నరేందర్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. శనివారం వరంగల్ 28వ డివిజన్‌లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర జరిగింది. బట్టలబజారు, పాతబీటుబజారు, పిన్నావారి వీధి, ఎల్లంబజారు తదితర కాలనీల్లో పర్యటించారు. పలు వ్యాపార సముదాయాల్లో వ్యాపారులను సురేఖ కలిసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సురేఖ మాట్లాడుతూ నగరం నడిబొడ్డున ఉన్న 28వ డివిజన్‌లో వీధిలైట్లు వెలగక అంధకారం నెలకొంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు మడిపెల్లి కృష్ణ, కురుమిల్ల సంపత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మీసాల ప్రకాష్ , నల్లగొండ రమేష్, చిప్ప వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.