 
															‘ఖిల్లా’లో పొంగిన వాగులు, వంకలు
ఖిల్లాఘనపురం: మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షానికి పెద్దవాగు పెద్దఎత్తున ప్రవహించింది. అలాగే మండలంలోని వాగులు, వంకలు, చెక్‌డ్యామ్‌లు పొంగిపారాయి. ఈదురు గాలులకు చేతికొచ్చిన వరి పంటలు నేలకొరగడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని వెంకటాంపల్లి – కమాలోద్ధీన్‌పూర్ రహదారిపై వరద పారడంతో స్థానిక అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు నుంచి వర్షంపునీరు లోనికి చేరడంతో సిబ్బంది బకెట్లతో బయటకు పారపోశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
