 
															వర్షం.. రైతన్నకు నష్టం
రేవల్లిలో రికార్డు వర్షపాతం నమోదు
ఖిల్లాఘనపురంలో పొంగి పొర్లుతున్న పెద్ద వాగు
వనపర్తి: మోంఽథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా రేవల్లి మండలంలో 142 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. అమరచింత, ఆత్మకూరు మండలాల్లో అత్యల్పంగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించంది. తుపాను ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. పెద్దమందడి, మదనాపురం తదితర ప్రాంతాల్లో పలుచోట్ల రహదారులపై వరద పారడంతో రాకపోకలు కాసేపు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా వర్షంతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే సమాచారం ఇచ్చేలా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
● జిల్లాకేంద్రంలోని మర్రికుంట చెరువు అలుగు పారడంతో రోడ్డుపై నీరు పొంగిపొర్లింది. వాహనదారులు, పాదచారులు జిల్లాకేంద్రం నుంచి కర్నూలు రోడ్డులో ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొల్సిన పరిస్థితి నెలకొంది.
నేలకొరిగిన వరి.. తడిసిన పత్తి
పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు
మళ్లీ తెరుచుకున్న జలాశయాల గేట్లు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
