
కోతకు గురైన భూములు..
గణప సముద్రం చెరువును రిజర్వాయర్‌గా మారుస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభం కావడంతో కొందరు వ్యక్తులు కత్వకు ఓ పక్కన ఉన్న కొంత సిమెంట్ బెడ్డు, రాతి కట్టడాన్ని తొలగించారు. గతేడాది పెద్ద వాగుకు భారీగా వరద రావడంతో సగభాగం తెగి పలువురు రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. దెబ్బతిన్న భూములకు పరిహారం ఇవ్వాలని, ఈ ఏడాది వర్షాకాలంలో వాగు పారితే వందల ఎకరాల భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని.. వెంటనే మరమ్మతులు చేపట్టాలంటూ రైతులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో పాటు తహసీల్దార్, వ్యవసాయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కత్వ నిర్మాణం పూర్తయితేనే కేఎల్‌ఐ నీరు గణపసముద్రం రిజర్వాయర్‌కు చేరుతాయి.