సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ

Jun 3 2025 6:53 AM | Updated on Jun 3 2025 6:53 AM

 సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ

సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ

వనపర్తిటౌన్‌: మున్సిపాలిటీల సమగ్రాభివృద్ధికి వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు వంద రోజుల కార్యాచరణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఈఈ యూనుస్‌, మేనేజర్‌ శంకరయ్య, రెవెన్యూ ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పుట్టపాకల మహేష్‌, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం, వెంకటేశ్‌, చీర్ల సత్యం, నాయకులు పరశురాం, ఎల్‌ఐసీ కృష్ణ, మెప్మా సిబ్బంది బాలరాజు, యువరాజు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement