బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి

May 3 2025 12:18 AM | Updated on May 3 2025 12:18 AM

బాధిత

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి

వనపర్తి: జిల్లాలో బాధితులకు ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు అండగా ఉండాలని ఎస్పీ రావుల గిరధర్‌ అన్నారు. జిల్లాలో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నేరస్థుడికి కఠిన కారాగార శిక్ష, రూ.25 వేలు జరిమానా విధించడంలోనే కాక వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్ష పడడంలో కృషిచేసిన పోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టి.శ్రీనివాసచారి, కోర్టు లైజనింగ్‌ అధికారి హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యంను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిజాన్ని గెలిపించే బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై ఉందన్నారు. పోలీసు న్యాయ వ్యవస్థలో బాగా పనిచేసిన అధికారులను తప్పక గుర్తిస్తామన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా పోలీసులు ఇంకా బాగా పనిచేసి జిల్లా న్యాయస్థానానికి, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గోపాల్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి

వనపర్తి రూరల్‌: ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. శుక్రవారం శ్రీరంగాపురం మండలంలోని కంభాళాపురంలో ‘గావ్‌ చలో– బస్తీ చలో’ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ మాజీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు పురుషోత్తంరెడ్డి, మండల ఇన్‌చార్జ్‌ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి ప్రతి ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల దగ్గరకి వెళ్లి కూలీలతో మాట్లాడారు. సరైన సమయంలో కూలీ డబ్బులు అందడం లేదని వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని, కానీ, కాంగ్రెస్‌ నాయకులు లోపాయికారిగా వారికి నచ్చిన మంజూరు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.2.61 లక్షలు ఇస్తుందని, అయితే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఒక్క కార్యకర్తను కూడా చేర్చుకోలేదని మండిపడ్డారు. అనంతరం వివిద పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీజేపీలో చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు రాములు, జానీ, రాజేష్‌, శివ, నరేందర్‌రెడ్డి, కార్తీక్‌, శివ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం

చట్టబద్ధత కల్పించాలి

వనపర్తి టౌన్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ ఆమోదించడంతో శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కోట్ల రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి దేవుజా నాయక్‌, పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి 
1
1/2

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి 
2
2/2

బాధితులకు న్యాయవాదులు అండగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement