మల్లెల తీర్థం జలపాతమే కారణమా? | - | Sakshi
Sakshi News home page

మల్లెల తీర్థం జలపాతమే కారణమా?

Feb 27 2025 1:18 AM | Updated on Feb 27 2025 11:46 AM

సొరంగం ఘటన జరిగిన ప్రదేశం మల్లెలతీర్థం జలపాతం లోయ ప్రాంతం అయి ఉండవచ్చని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచితలబైలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఇన్‌లెట్‌ నుంచి 13.93 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదాన్ని నేరుగా పరిశీలిస్తే.. ఆ ప్రాంత వరకు వెళ్తోంది. ఇక్కడ 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ.. నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెల తీర్థంలో ఏడు గుండాలు ఉన్నాయి. 

ఈ గుండాల వద్దనే నీటి నిల్వ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సొరంగం వద్ద లికేజీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో కిలోమీటరు వరకు సీపేజీ ఉండే అవకాశం ఉందని.. ముందే తెలిసినా జేపీ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన సహాయక చర్యలను వేగవంతం చేసి.. రెండు రోజుల్లో ఎనిమిది మంది కార్మికులను బయటికి తెస్తామని మంత్రులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement