500 పైబడి మార్కులు
సాధించినవారు
రామభద్రపురం:
మహానేత వైఎస్సార్ చదువుల సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. నిరుపేద కుటుంబాల బాలికల చదువుకు, భవితకు కేజీబీవీలు భరోసా ఇస్తున్నాయి. శతశాతం ఫలితాలతో దూసుకుపోతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలు, ఆర్థిక స్థోమత లేక మధ్యలో చదువులు ఆపేసిన ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటుచేసిన కేజీబీవీలు పేద కుటుంబాల్లో విద్యావెలుగులు నింపుతున్నాయి. నాడు 6 నుంచి 10వ తరగతి వరకు చదివేందుకు బాలికలకు బాసటగా నిలిచిన విద్యాలయాలను వైఎస్సార్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి స్థాయిపెంచారు. ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. అన్ని విద్యాలయాలను నాడు–నేడు నిధులతో కార్పోరేట్ విద్యాలయాలకు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్ బోర్డులు, బైలింగ్విన్ పుస్తకాలు, అమ్మ ఒడి, వసతి, విద్యా దీవెన, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం తదితర సదుపాయాలు సమకూర్చారు. ఆ సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. కేజీబీవీ బాలికలు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. భవితకు బంగారు బాటలు వేసుకుంటున్నారు.
● కేజీబీవీల్లో చేరేందుకు ఆసక్తి
గత వైఎస్సార్‌సీపీ సర్కారు పాలనలో అమలు చేసిన సంస్కరణలే నేడు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలకు దోహదం చేశాయని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. పేదబాలికలు పైసా ఖర్చులేకుండా వసతితో కూడిన నాణ్యమైన విద్యా బోధనను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. దాంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు కేజీబీవీ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చేరేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో మొత్తం కేజీబీవీలు
26
94.13
పదోతరగతిలో
ఉత్తీర్ణత శాతం:
ఇంటర్‌లోనూ శతశాతం ఉత్తీర్ణత
జిల్లాలో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, ఎల్.కోట, నెల్లిమర్ల, వేపాడ, గుర్ల, వంగర మండలాల్లో ఉన్న మొత్తం 9 కేజీబీవీలు ఇంటర్ ఫస్టియర్‌లో వంద శాతం ఫలితాలు సాధించాయి. అలాగే, రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల, జామి, కొత్తవలస, పూసపాటి రేగ, రేగిడి, తెర్లాం మండలాల్లో ఉన్న మొత్తం 10 కేజీబీవీలు ఇంటర్ సెకండియర్‌లో శతశాతం ఫలితాలు సాధించాయి. రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, గంట్యాడ, గుర్ల మండలాల్లోని కేజీబీవీల్లో రెండేళ్ల ఇంటర్ పరీక్షల్లోనూ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇంటికి దూరంగా.. చదువుకు దగ్గరగా..
జిల్లాలోని పదో తరగతి ఫలితాల్లో ఏటా కస్తూర్బా గాంధీ విద్యాలయాల బాలికలు సత్తా చూపుతున్నారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉండగా వాటిలో ఈ ఏడాది 94.13 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 500 మార్కులు పైబడి 229 మందికి వచ్చాయి. అలాగే, 9 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా అందులో రామభద్రపురం, బాడంగి, బొండపల్లి, డెంకాడ, గరివిడి, కొత్తవలస, తెర్లాం, వంగర, ఎల్.కోట కేజీబీవీలు ఉన్నాయి.
పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు
నెరవేరుతున్న వైఎస్సార్ కల,
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం
కేజీబీవీలను ఏర్పాటు చేసిన
దివంగత నేత వైఎస్సార్
ఇంటర్ విద్యను ప్రవేశపెట్టిన గత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గత ప్రభుత్వాల సంస్కరణలతో
మెరుగైన ఫలితాలు
కేజీబీవీల్లో చేరేందుకు
మరింత ఆసక్తి చూపుతున్న బాలికలు
229
మంది


