జెడ్పీలో కారుణ్య నియామకాలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీలో కారుణ్య నియామకాలు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

ఉత్తర్వులు అందజేసిన జెడ్పీ చైర్మన్‌

మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం రూరల్‌: జిల్లా పరిషత్‌ పరిధిలో కారుణ్య నియామకాల్లో భాగంగా ముగ్గురికి జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కె.లక్ష్మిని లోగిశ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహాయకురాలిగా నియమించారు. కె.జయలక్ష్మిని పార్వతీపురం డివిజన్‌ కార్యాలయంలోను, కె.రాజ్‌కుమార్‌ను జియ్యమ్మవలస ఎంపీడీవో కార్యాలయ సహాయకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఇ.నాగలక్ష్మి, ఏఓ ఎన్‌.రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement