మాది రైతు కుటుంబం. బూసాయవలస కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదివాను. 535 మార్కులు సాధించాను. కేజీబీవీలు ఏర్పాటుచేయకుంటే మా లాంటి పేద కుటుంబాల బాలికలు చదువుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. చదువుకు దూరమయ్యేవారం. విద్యాలయాలను గత ప్రభుత్వ హయాంలో సుందరంగా తీర్చిదిద్దారు. నాటి సంస్కరణల వల్లే ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.
– కె.కావ్య, బూసాయవలస కేజీబీవీ విద్యార్థిని
సంతృప్తికర ఫలితాలు..
కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. 26 కేజీబీవీలలో పదో తరగతిలో 94.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని పదో తరగతిలో 9 కేజీబీవీలు, ఇంటర్ ఫస్టియర్‌లో 9 కేజీబీవీ జూనియర్ కలాశాలలు, సెంకండియర్‌లో 10 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించారు. వచ్చే ఏడాది కూడా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఫలితాలను మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాం.
– యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, జిల్లా కేజీబీవీ కో ఆర్డినేటర్


