ఉత్తమ మార్కుల సాధనకు.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ మార్కుల సాధనకు..

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది. అందుకు అనుగుణంగా ఉత్తమ మార్కులు సాధించేందుకు కష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో మా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చారు. మరింత మెరుగైన మార్కుల సాధనకు అవకాశం లభించడంతో సప్లిమెంటరీపై కసరత్తు చేపడుతున్నారు. ఈ ఏడాది ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు అవకాశం లభించడంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల్లో వారి సంఖ్య అధికంగా ఉంది. సమయం వృథా కాకుండా మా అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. క్రమం తప్పకుండా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. జూన్‌ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా ఇంటర్‌ తరగతులు ప్రారంభించనున్నాం. – వేమూరి హరగోపాల్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, పాలకొండ.

Advertisement
 
Advertisement
Advertisement