ఆర్టీసీ బస్సు ఢీ కొని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ కొని వృద్ధుడి మృతి

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట ఆంజనేయస్వామి ఆలయం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్పు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆరికతోట గ్రామానికి చెందిన పూసర్ల శ్రీరామమూర్తి అలియాస్‌ పుల్లయ్య (70) తన వ్యక్తిగత నిమిత్తం ఆ జంక్షన్‌కు వచ్చాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయేందుకు జాతీయ రహదారి దాటుతుండగా అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో శ్రీరామమూర్తి అక్కడక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై జ్ఞానప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement