పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షల్లో తగ్గిన ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షల్లో తగ్గిన ఉత్తీర్ణత

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

గత ఏడాది 94.5 శాతం...

ఈ ఏడాది 91.76 శాతం

విజయనగరం అర్బన్‌: పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత గతేడాది కంటే 4.5 శాతం తగ్గింది. ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గతేడాది జిల్లాలో 6,938 మందిలో 95.36 శాతంతో 6,616 మంది పాసైతే, ఈ ఏడాది పరీక్ష రాసిన 7,222 మందిలో 91.76 శాతంతో 6,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణలయ్యారు. ఈ ఏడాది పరీక్ష రాసిన 3,070 మంది బాలికల్లో 94.43 శాతంతో 2,899 మంది, బాలురు 4,152 మందిలో 89.79 శాతంతో 3,728 మంది పాసయ్యారు. విశాఖలో పరీక్షకు హాజరైన ఎల్‌.కోట మండలం గొల్జాం గ్రామానికి చెందిన జామి చేతన్‌ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. జిల్లాలో పరీక్ష రాసిన వారిలో 118 మార్కులు సాధించిన అల్లు లవ శాత్విక్‌, 116 మార్కులతో సీర యోగేశ్వర్‌, గండ్రేటి కిశోర్‌ కుమార్‌ జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వెయ్యిలోపు ర్యాంకులు తెచ్చుకున్నవారిలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నారు. మెరకముడిదాం మండలం మర్రివలస చెందిన డి.వెంకటేశ్‌ (115/120), గుర్ల మండలం గుసినికి చెందిన జె.పవన్‌ (112/120), గుర్ల మండలం పెదబంటుపల్లి జి.సంజయ్‌ (109/120), సంతకవిటి మండలం మామిడిపల్లి చెందిన కె.రుక్మిణి (98/120), రాజాం మండలం బూరాడ పేటకు చెందిన ఎన్‌.జాహ్నవి (96/120) మార్కులు సాధించారు.

చేతన్‌కు అభినందనలు

లక్కవరపకోట: పాలిసెట్‌ ఫలితాల్లో ఎల్‌.కోట మండలంలోని గొల్జాం గ్రామానికి చెందిన జామి చేతన్‌ సత్తాచూపాడు. 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. చేతన్‌ విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదివి 588/600 మార్కులు సాధించాడు. తండ్రి శ్రీనివాస్‌ ఆర్మీలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. స్టేట్‌ ర్యాంకర్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement