తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు | - | Sakshi
Sakshi News home page

తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిసరాల్లో పంట పొలాలు, తోటల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పదిరోజుల నుంచి గిజబ, తోటపల్లి, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అరటి, మొక్కజొన్న, పామాయిల్‌ తదితర పంటలు నాశనం చేస్తున్నాయని రైతులంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భీతిల్లుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement