విజయననగరం అర్బన్: స్థానిక సీతం కళాశాలలో మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘నాయకత్వ శైలి, భావోద్వేగ మేధస్సు’ అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వృత్తిపరమైన విజయానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా కార్యక్రమం జరిగిందని ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. రిసోర్స్ పర్సన్‌గా హాజరైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎ.చంద్రమోహన్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో నాయకత్వం మారుతున్న తీరును వివరించారు. వర్క్‌షాప్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన మాజీ జీఎం ఓఆర్‌ఎంరావు, డిస్క్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దివాకర్ వివిధ అంశాలపై ప్రసంగించారు. అనంతరం ప్రతిష్టాత్మక ‘క్వాంటమ్ ఆల్గారిథమ్ కోర్సు’కు ఎంపికై న సీతం క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ సెల్‌కు చెందిన అధ్యాపకులు డాక్టర్ శ్రీలత కరణం, డాక్టర్ జీ.శ్రీచందనలను అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.


