విజయనగరం టౌన్: రాజ్యాంగం, మత స్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంతో ఈ నెల 12న మంగళవారం చలో విజయనగరం దళిత క్రైస్తవ మహాసభ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సంఘమిత్ర ఆర్‌ఎస్.జాన్ తెలిపారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం సమావేశం నిర్వహించి, కరపత్రాలను ఆవిష్కరించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ఈ ఏడాది మార్చి 24న సుప్రీం కోర్టు తీర్పు, ఆకివీడులో జరిగిన సంఘటనలపై క్రైస్తవ మహాసభను ఉత్తరాంధ్ర సంఘాల సహకారంతో సిమ్స్ చర్చి ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిక, మాజీ కేంద్రమంత్రి జీవీ.హర్షకుమార్, పీవీ.సునీల్ కుమార్ ఐపీఎస్, జీవీ విజయకుమార్ ఐఎఎస్, తదితరులు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది సంఘం నాయకులు హాజరుకానున్నారన్నారు. క్రైస్తవ సోదరులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆదాడ మోహనరావు, తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


