● ఊరి ఊపిరి తీయొద్దు.. | - | Sakshi
Sakshi News home page

● ఊరి ఊపిరి తీయొద్దు..

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

బొంతు కొండ క్యారీ లీజును తక్షణమే రద్దుచేయాంటూ విజయనగరం మండలం కొండకరకాం గ్రామస్తులు కలెక్టరేట్‌ వేదికగా కదం తొక్కారు. భారీస్థాయిలో ధర్నా చేశారు. ఊరి పెద్దలను అడగకుండా, గ్రామసభ పెట్టకుండా ఎన్‌ఓసీ ఎలా ఇస్తారంటూ నిలదీశారు.

సర్వే నంబర్‌ 198/50లో బంగారమ్మ ఎర్త్‌ ఓవర్స్‌, వెంకట మురుగన్‌ స్టోన్‌ క్రషర్లకు అనుమతులు ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఊరు ఊపిరి తీసేయొద్దని, అదే జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొండకు దగ్గరలోనే మెడికల్‌ కాలేజీ, ట్రైబల్‌ యూనివర్సిటీకి గతంలో కేటాయించిన భూములు, ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉన్నాయని, కొండను తవ్వితే పోరాటం తప్పదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement