
స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ హాకీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు మంగళవారం పూర్తయ్యాయి. నగరంలోని రాజీవ్ స్టేడియంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికలకు సుమారు 150 మంది క్రీడాకారులు హాజరుకాగా.. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులను అండర్–14,17 విభాగాల్లో ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరగనున్న అంతర్ జిల్లాల బాల,బాలికల స్కూల్‌గేమ్స్ ఫోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.