బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప్రకటించాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప్రకటించాల్సిందే..!

Jun 23 2025 5:26 AM | Updated on Jun 23 2025 5:26 AM

బుచ్చ

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప

జిందాల్‌ పరిశ్రమకు నీటి తరలింపును సంఘటితంగా అడ్డుకోవాలి

బుచ్చి అప్పారావు జలాశయం

ఆయుకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు

గంట్యాడ: గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయాన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని బుచ్చి అప్పారావు జలాశయం ఆయుకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం ( తాటిపూడి) వద్ద ఆదివారం సాయంత్రం ఆయుకట్టు పరిరక్షణ కమిటి సమావేశం నిర్వహించారు. జిందాల్‌ పరిశ్రమకు నీటి తరలింపును సంఘటితంగా ఎదుర్కోవాలని సభ్యులందరూ ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. ఒక్క నీటిబొట్టు కూడా తరలించడానికి ఒప్పుకోకూడదని నిర్ణయించారు.

ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా ప్రకటించాలి..

గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయాన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలి. ఏ ప్రభుత్వం అయినా సాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. తాటిపూడి జలాశయం కోసం గొర్రిపాటి బుచ్చి అప్పారావు పరితపించేవారు. గతంలో జలాశయం నుంచి 45 వేల ఎకరాలకు సాగునీరు అందగా.. క్రమంగా 15,368 ఎకరాలకు తగ్గించేశారు. 30 వేల ఎకరాల రైతులు సాగునీటి హక్కు కోల్పోయారు. ఈ సమస్యను జిల్లాకు చెందిన మంత్రి, ఎస్‌.కోట ఎమ్మెల్యే, తదితరులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలి. – అల్లుకేశవ వెంకట జోగినాయుడు,

జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రైతు, ధర్మవరం

పరిశ్రమకు నీరిస్తే పంట చేతికి రాదు..

బుచ్చి అప్పారావు జలాశయం నీటిని పరిశ్రమకు తరలిస్తారని తెలిసింది. ఏమాత్రం నీటిని ఇచ్చినా పంట చేతికిరాదు. ఇప్పటకే పంటలకు ఆఖరి తడి కోసం అహోరాత్రులు కష్టపడాల్సిన పరిస్థితి. పరిశ్రమ ప్రతినిధులు బుచ్చి అప్పారావు జలాశయం నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకోవాలి. నీటి తరలింపునకు అంగీకరిస్తే పూర్వీకుల త్యాగాలకు అర్థం ఉండదు.

– గొర్లె రవికుమార్‌,

జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రైతు, జామి

నీటిని తరలిస్తే నష్టపోతాం..

జిందాల్‌ పరిశ్రమకు నీటిని తరలిస్తే తీవ్రంగా నష్టపోతాం. కంపెనీలకు నీరు తరలించకుండా అడ్డుకోవాలి. వ్యవసాయంపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. ఇప్పటికే సాగునీరు సరిపోదు. ఇటువంటి పరిస్థితుల్లో నీటిని తరలిస్తే రైతాంగం పరిస్థితి ఏమిటి?. – బోళం ఏర్నాయుడు, రైతు , పెంట శ్రీరాంపురం గ్రామం

అడ్డుకోవాలి..

బుచ్చి అప్పారావు జలాశయం ఉందనే ఉద్దేశంతో జిందాల్‌ పరిశ్రమకు భూ సేకరణ చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, పైప్‌ లైనుల పనులకు సంబంధించి రైతులు వేలాది ఎకరాల భూమిని కోల్పోయారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి నీటి తరలింపును అడ్డుకోవాలి.

– బుద్దరాజు రాంబాబు, రైతు సంఘం కార్యదర్శి

రైతులు నష్టపోయారు..

జిందాల్‌ పరిశ్రమకు భూములిచ్చి రైతులు నష్టపోయారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి జిందాల్‌ యాజమాన్యం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూస్తోంది. బుచ్చి అప్పారావు జలాశయం నుంచి ఎంఎస్‌ఎం పార్కు ఏర్పాటు చేసి నీటిని తరలిస్తే ఈ ప్రాంతం అంతా ఏడారవుతుంది. జలాశయం నీటిని పరిశ్రమలకు తరలించకుండా హైకోర్టులో పిల్‌ వేయనున్నాం. – ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్సీ

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప1
1/4

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప2
2/4

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప3
3/4

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప4
4/4

బుచ్చి అప్పారావు జలాశయాన్ని.. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌గా ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement