
సేవలకు సన్మానం
నెల్లిమర్ల రూరల్: మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్ప కళావేదికపై ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబుకు ఘన సత్కారం లభించింది. ఆంధ్రా, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సురేష్‌బాబును దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సత్కరించారు. సేవలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో క్షత్రియ సేవా సమితి సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూనియన్ మినిస్టర్లు గజేంద్రసింగ్ సెకావత్, కిషన్‌రెడ్డి, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.