–8లో
పడగ విప్పుతున్న మహమ్మారి
పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా మహమ్మారి పడగ విప్పుతోంది. విద్యార్థులనూ ఆస్పత్రులపాలచేస్తోంది.
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెదశాఖ పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం పూసనందికి చెందిన గర్భిణి కొండగొర్రి చంద్రమ్మ శుక్రవారం ఒక్కసారి కళ్లుతిరిగి పడిపోయింది. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఐదు కిలోమీటర్ల రాళ్లదారిలో డోలీలో పెదశాఖ వరకు తెచ్చి అక్కడ నుంచి ఫీడర్ అంబులెన్స్‌లో కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యకోసం అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అద్దెవాహనంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. పీహెచ్‌సీలో మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యులు అందుబాటులో లేరని చంద్రమ్మ బంధువులు ఆరోపించారు.
జిల్లాకు చెందిన సంధ్యారాణి గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నా విద్య, వైద్య కష్టాలు తీర్చే‘దారి’ చూపడంలేదని గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ మల్లయ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.