
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర
● యూటీఎఫ్ జిల్లా కమిటీ ధ్వజం
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే సంస్కరణలను మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సమావేశ మందిరంలో సంఘం జిల్లా కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలలను బలపర్చే దిశగా కూట మి ప్రభుత్వ నిర్ణయాలు ఉండడం లేదని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యను అందించడంపై కాకుండా యోగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్‌ల నిర్వహణలౖ పె దృష్టి పెట్టడం సరికాదన్నారు. పాఠశాల సమ యం మొత్తాన్ని బోధనకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు ఉపాధ్యాయులను క్లస్టర్ పాఠశాలలకే కేటాయించకుండా తిరిగే విధంగా నియమించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో సుమారు 1500 మంది పొజిషన్ ఐడీలు లేక, క్యాడర్ స్ట్రెంత్ లేనందున జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వీరికి పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9న జాతీయ స్థాయి లో జరిగే సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ పూర్తి మద్దతు ప్రకటించిందని, యూటీఎఫ్ సభ్యులు భాగస్వా మ్యం అవుతారని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయ గౌరి, రాష్ట్ర కమిటీ సభ్యులు జేఆర్‌పీ పట్నాయక్, రాష్ట్ర కార్యదర్శి పి.కస్తూరి, అకడమిక్ కమిటీ సభ్యుడు డి.రాము, కోశాధికారి సీహెచ్ భాస్కరరావు పాల్గొన్నారు.