
కళలను ప్రోత్సహించాలి
చీపురుపల్లి రూరల్(గరివిడి): నాటికలు కళలకు జీవమని, కళలను మరింతగా ప్రోత్సహించాలని సినీ నటి కవిత అన్నారు. గరివిడిలోని శ్రీరాం హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళల మీద అభిమానం ఉన్న వాళ్లు మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటాన్ని హర్షించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. జయలలిత మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల్లో రెండు రోజులుగా భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషిస్తున్నానన్నారు. గరివిడి ప్రాంతంలో ఇలాంటి నాటిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ మంచి పరిణామమని కొనియాడారు. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ప్రతినిధులు వాకాడ గోపి, రవిరాజ్, బమ్మిడి కార్తీక్, కంబాల శివ, వాకాడ శ్రీనువాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆహ్వాన నాటిక పోటీల కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, లోక్‌సత్తా పార్టీ నాయకులు భీశెట్టి బాబ్జీ, కె.త్రిమూర్తులరాజుతో పాటుగా అతిథులుగా రచయిత్రీ జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్‌లు రవితేజ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
సినీ నటీమణులు కవిత, జయలలిత