
నానాటిక అభివృద్ధి చెందాలి
కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు
మరో ముఖ్యఅతిథి, సినీనటుడు నరసింగరావు మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో మంచి సాంస్కృతిక నాటిక కార్యక్రమాలు జరిగేవని, అలాంటి గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు మంచి ఆలోచన చేసి, ఈ సాంస్కృతిక నాటిక కార్యక్రమాన్ని తలపెట్టిన కమిటీ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. గరివిడి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వాకాడ గోపి, అధ్యక్షుడు రవిరాజ్, ఉపాధ్యక్షుడు బమ్మిడి కార్తీక్, ప్రధాన కార్యదర్శి కంబాల శివ, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, ఉప్పు శ్రీను తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో అతిథులుగా జాలాది విజయ, బలివాడ రమేష్, సినీ ఆర్టిస్ట్ రవితేజ, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో పాటు పలువురు మండలస్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
● దేశం నలుమూలలా గరివిడికి పేరు ప్రఖ్యాతులు
● సినీనటుడు ఆర్.నారాయణమూర్తి
చీపురుపల్లిరూరల్(గరివిడి): అన్ని రంగాల మాదిరిగానే నాటిక రంగానికి కోటా ఉండాలని, నాటిక రంగం మరింతగా అభివృద్ధి చెందాలని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ఆకాంక్షించారు. ఈ మేరకు గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ రంగస్థలం కళాకారులకు అమ్మఒడి అని, రంగస్థలం పుణ్యస్థలమన్నారు. నాటిక రంగం బతకాలని, నాటిక రంగం ఒక జీవం లాంటిదని అభిప్రాయ పడ్డారు. కళలు బతికుండాలని, కళలతోనే సమాజం ముడిపడి ఉందన్నారు. గరివిడి ప్రాంతంలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవం కార్యక్రమంలో ప్రథమంగా కీర్తిశేషులు దుర్గాప్రసాద్ షరాఫ్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యాసంస్థలతో పాటు ఉక్కు కర్మాగారాలు నెలకొల్పి భారతదేశంలోనే గరివిడికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని కొనియాడారు.
గరివిడికి మంచి ఎదుగుదల
1975లో దుర్గాప్రసాద్ షరాఫ్ హయాంలో నాటి సాంస్కృతిక కార్యక్రమాలను 29 ఏళ్ల తరువాత నేడు గరివిడిలో మరోసారి సాంస్కృతిక పునరుజ్జీవం చేస్తామని నడుం బిగించి కార్యక్రమానికి నాంది పలికిన గరివిడి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సాంస్కృతిక నాటిక పోటీలు గరివిడి ప్రాంతాన్ని మంచి ఎదుగుదలకు తీసుకువెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గరివిడి పట్టణానికి చెందిన గరివిడి లక్ష్మి (బుర్రకథ) ఉభయ రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఘంటసాల, సుశీలమ్మ ఇలా ఎంతో మంది కళాకారులను కళామతల్లికి అందించిన విజయనగరం కళల కాణాచి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ సినిమాలో సాంగ్ పాడి సందడి చేశారు.

నానాటిక అభివృద్ధి చెందాలి