
9,500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): నవోదయం 2.0లో భాగంగా మంగళవారం ఒడిశా సిబ్బందితో కలిసి రాయగడ జిల్లాలోని కెరడ, వనజ, సుళవ గ్రామాల పరిధిలో నిర్వహిస్తున్న సారా బట్టీలపై దాడి చేసి 45 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఈ దాడిలో 460 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడుల్లో విజయనగరం ఈఎస్‌ఐఎఫ్ సీఐ రామచంద్రకుమార్, సీతానగరం ఎకై ్సజ్ సీఐ పద్మావతి తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు.