
చెరకు టన్ను ధర రూ.5 వేలు ఉండాలి
● ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు
రేగిడి: చెరకు రైతులు సాగు విస్తీర్ణం పెంచాలంటే చెరకు టన్ను ధర రూ.5 వేలు ఉండాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. రేగిడిలో విలేకరుల తో ఆయన ఆదివారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 10.25 శాతం రికవరీ ఆధారంగా చెరకు టన్ను ధర రూ.3550లు ప్రకటించిందని వెల్లడించారు. పెరిగిన ఖర్చులు దృష్ట్యా రైతుకు ఇది గిట్టుబాటు కాదని పేర్కొన్నారు. కనీసం టన్నుకు రూ.5వేలు చెల్లిస్తే కూలీల కొరత, పంటకు పెట్టుబడి పోను రైతుకు కొంత లాభదాయంగా ఉండేందుకు వీలుంటుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీతో కూడిన యాంత్రీకరణలు రైతులకు అందజేయాలని కోరారు. స్థానిక యాజమాన్యం రైతులకు గతంలో ఇచ్చే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ కొన సాగించాలని, ఉప ఉత్పత్తులలో వచ్చే లాభాల లో రైతులకు వాటా ఇవ్వాలని సూచించారు. రైతులు సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట అయిన చెరకుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కోరారు. చక్కెర పరిశ్రమ దేశ వ్యాప్తంగా సంక్షోభంలో ఉందని, దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల ఫలితంగా పంచదారకు సరైన ధర లేదని అన్నారు.
ప్రశాంతంగా
ఎంజీపీఏపీ ఆర్జేసీ సెట్
నెల్లిమర్ల : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశా ల కోసం ఆదివారం నిర్వహించిన ఎంజీపీఏపీ ఆర్జేసీ సెట్–2025కు 449 మంది విద్యార్థులు హాజరయ్యారు. నెల్లిమర్ల బాలికల కళాశాల కేంద్రంలో 401 మందికి గాను 297 మంది, గజపతినగరం కేంద్రంలో 198 మందికిగాను 152 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండు కేంద్రాల్లో 150 మంది గైర్హాజరయ్యారు. గురుకులాల జిల్లా కన్వీనర్ డాక్టర్ కేబీబీ రావు, మత్స్యకార బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీబీసీబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూఓ యశోధనరావు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించారు.
మహనీయుల ఆశయాలను సాధించాలి
విజయనగరం అర్బన్: భగీరథ మహర్షి జయంతి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ముందుగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను సాధించడ మే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుని స్ఫూర్తిని పొందేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి కె.జ్యోతిశ్రీ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటీ రామారావు, గృహ నిర్మాణ శాఖాధికారి గండి మురళి, సహాయ మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, ఏబీసీడబ్ల్యూఓ యశోధనరావు పాల్గొన్నారు.

చెరకు టన్ను ధర రూ.5 వేలు ఉండాలి