
ఏపీ శాక్స్ నిధులపై ఆడిట్
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ (ఏపీ శాక్స్) ద్వారా జిల్లాలో ఉన్న ఐసీటీసీలకు 2023–24 సంవత్సరంలో విడుదలైన నిధులపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ కార్యాలయంలో శనివారం ఆడిట్ నిర్వహించారు. ఏపీ శాక్స్ నుంచి వచ్చిన ఆడిట్ ఉద్యోగి శ్యామ్‌కుమార్ ఐసీటీసీ సెంటర్స్, ఎస్‌టీఐ క్లినిక్స్ సిబ్బంది నుంచి రికార్డులు తెప్పించుకుని ఆడిట్ నిర్వహించారు. నిధులు ఎంత విడుదల అయ్యాయి... వాటిని సక్రమంగా వినియోగించారా.. లేదా..., వినియోగించిన దానికి బిల్లులు ఉన్నాయా.. లేదా.., రికార్డుల్లో నమోదు చేసిందీ.. లేనిదీ... ఆడిట్‌లో పరిశీలించారు.