క్రీడా శిక్షణకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిక్షణకు వేళాయె..

May 1 2025 1:21 AM | Updated on May 1 2025 1:21 AM

క్రీడా శిక్షణకు వేళాయె..

క్రీడా శిక్షణకు వేళాయె..

ప్రాంతాల వారీగా శిక్షణ శిబిరాలు ఇలా..

నేటి నుంచి ప్రారంభం కానున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

ఎంపిక చేసిన ప్రాంతాల్లో

క్రీడాకారులకు శిక్షణ

విజయనగరం:

జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా క్రీడాధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 శిక్షణ శిబిరాలు నిర్వహించాలని శాప్‌ ఆదేశాల జారీ చేసింది. ఈ మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ దరఖాస్తులు స్వీకరించి నిష్ణాతులైన శిక్షకులను ఎంపిక చేసింది. వివిధ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన క్రీడలకు శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచారు. జిల్లాలో ప్రాంతాల వారీగా ఆదరణ ఉన్న క్రీడాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు శిబిరాలు కేటాయించినట్టు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఒక్కో శిబిరానికి రూ.7వేలు

వేసవిలో నిర్వహించే ఉచిత క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్‌ బడ్జెట్‌ విడుదల చేసింది. ఒక్కో శిబిరానికి రూ.7 వేల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రూ. 5వేలతో క్రీడా సామగ్రి కొనుగోలు చేయాలి. నిర్వహిస్తున్న శిక్షకుడికి గౌరవ వేతనం కింద రూ.2000లు కేటాయించారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఒక్కో శిబిరంలో 25 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఆటలాడుతున్న క్రీడాకారులు

ఆర్చరీ: రామనారాయణం (విజయనగరం)

అథ్లెటిక్స్‌: విజ్జి స్టేడియం (విజయనగరం),

చింతపల్లి, రాజాం, బొండపల్లి

బాల్‌ బ్యాడ్మింటన్‌: జెడ్పీహెచ్‌ఎస్‌ నెమలాం, జెడ్పీహెచ్‌ఎస్‌ మెరకముడిదాం

బాస్కెట్‌ బాల్‌: విజ్జి స్టేడియం, విజయనగరం

బాక్సింగ్‌: ద్వారపూడి, సవరవల్లి, నెల్లిమర్ల, దుప్పాడ, విజయనగరం విజ్జి స్టేడియం, బీపీఎం స్కూల్‌ విజయనరగం, కొండవెలగాడ.

బ్యాడ్మింటన్‌: జెడ్పీహెచ్‌ఎస్‌ ధర్మవరం,

బొబ్బిలి, రాజాం

ఫుట్‌బాల్‌: విజ్జి స్టేడియం (విజయనగరం), నెల్లిమర్ల, జొన్నగుడ్డి (విజయనగరం), విజయనగరం రాజీవ్‌ స్టేడియం

ఫెన్సింగ్‌: కస్పా హైస్కూల్‌, విజయనగరం

హ్యాండ్‌బాల్‌: జెడ్పీహెచ్‌ఎస్‌ డెంకాడ, ఏపీ మోడల్‌ స్కూల్‌ అక్కివరం, గరివిడి

ఖోఖో: జెడ్పీహెచ్‌ఎస్‌ పూల్‌బాగ్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ తోండ్రంగి, కస్పా హైస్కూల్‌ విజయనగరం, పెదవేమలి

కబడ్డీ: రెల్లివలస, గరివిడి, వల్లాపురం, సారిపల్లి, జీజీహెచ్‌ఎస్‌ విజయనగరం

కరాటే: విజయనగరం పీఎస్‌ఆర్‌ కాలనీ, విజయనగరం ఉడాకాలనీ

సాఫ్ట్‌బాల్‌: భోగాపురం, పారాది

తైక్వాండో: విజయనగరం కస్పా హైస్కూల్‌, బొబ్బిలి, విజయనగరం మదర్‌ థెరిసా క్లబ్‌, బొబ్బిలి సంస్థానం

వాలీబాల్‌: జెడ్పీహెచ్‌ఎస్‌ కొత్తవలస, జెడ్పీహెచ్‌ఎస్‌ భోగాపురం, గరివిడి, పెదమజ్జిపాలెం, జీజీహెచ్‌ఎస్‌ విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement