
భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక ఫూల్‌బాగ్ లక్ష్మీగణపతికాలనీలో కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం వద్ద కొలువైన 60 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయవ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి ఉపాసకుడు కర్రి వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కనులపండువగా నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఇసరపు శ్రీనివాస గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు దువ్వు శ్రీనివాసరావు, బెహరా కూర్మారా వు, దన్నాన రామమూర్తి, అర్చకులు శ్రీనివాసశర్మ, సభ్యులు సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
60
అడుగుల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు