
● డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వా మి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించు కుని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం, శ్రీ విజ యదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీని వాసరావు మాట్లాడుతూ అంగ వైకల్యానికి చింతించకుండా, ఇతరులపై ఆధారపడకూడదనే లక్ష్యంతో అనేక మంది తమ పనిని, వృత్తిని ధైర్యంగా కొనసా గిస్తున్నారన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అండ గా ఉండి వృత్తి విద్యాకోర్సులు అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల జీవనోపాధి కోసం కుట్టుమిషన్లు అందించడం హర్షణీయమన్నా రు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు కొండబాబు, విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం నభ్యులు, జిల్లా లోని దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.