
విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఈశ్వర్ కౌశిక్, తదితరులు
విజయనగరం రూరల్: జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో గల ఇండోర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌తో సబ్ జూనియర్స్, క్యాడెట్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. అండర్– 17 విభాగంలో విజయనగరానికి చెందిన రొంగలి సుశ్రితనాయుడు బంగారు పతకం సాధించడమే కాకుండా ఈ నెలలోనే గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఈశ్వర్ కౌశిక్, సీతం విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, జిల్లా ఫెన్సింగ్ అసొసియేషన్ చీఫ్ కోచ్ డీవీ చారి ప్రసాద్‌లు బహుమతులు ప్రదానం చేశారు.

జాతీయ పోటీలకు ఎంపికై న రొంగలి సుశ్రిత