
పర్యాటక కేంద్రంలో చిన్నారుల సందడి
గరుగుబిల్లి: తోటపల్లి కుడిమట్టికట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రాన్ని వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పార్క్ ఆదివారం సందడిగా మారింది. పార్వతీపురం ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రంలో ఏర్పాటుచేసిన అపురూప చిత్రాలు, ఈప్రాంత సామాజిక స్థితిగతులను తెలియజేస్తున్నాయి. విగ్రహాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. చిన్నారులు ఆడుకునేందుకు జంప్‌బాల్, ఊయల, జారుడుబల్ల ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో పర్యాటక కేంద్రం, తోటపల్లి భారీ నీటిపారుదల ప్రాజెక్టు, చినతిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వరస్వామి ఆలయం ఉండడంతో ఈ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తుంది. పర్యాటకులు అధికంగా సందర్శనకు రావడంతో చి రువ్యాపారులు సైతం తమ వ్యాపారాలు మె రుగ్గా ఉండడంతో ఆనందం వ్య క్తం చేస్తున్నారు.

బోటుషికారు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సందర్శకులు