
బాడీబిల్డింగ్ పోటీల్లో శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్న క్రీడాకారులు
రాజాం సిటీ: వ్యాయామంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక జీఎంఆర్ ఐటీలో ఏపీ మిస్టర్ ఆంధ్రా ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాత్రి 9.30 గంటల వరకు ఈ పోటీలు జరగ్గా 11 జిల్లాల నుంచి 90 మంది క్రీడాకారులు పాల్గొని శరీర సౌష్టవాన్ని ప్రదర్శించారు. మొత్తం 8 కేటగిరీలలో నిర్వహించిన ఈ పోటీల్లో 55 కిలోల విభాగంలో ఎ.రాజేష్, జి.రాంబాబు (విజయనగరం), పి.రాజేష్ (శ్రీకాకుళం), ఎ.చిరంజీవి (తూర్పుగోదావరి), పి.మోహన్ (విజయనగరం)లు వరుస ఐదు స్థానాల్లో నిలిచారు. 60 కేజీల విభాగంలో ఈవీఎన్ కుమార్ (గుంటూరు), ఎస్‌కే అబ్దుల్ ఖాన్ (శ్రీకాకుళం), ఎస్.వంశీమెహర్(విశాఖపట్నం), జె.కల్యాణ్ (తూర్పుగోదావరి), ఆర్.హరీష్ (శ్రీకాకుళం)లు వరుస స్థానాలు దక్కించుకున్నారు. 65 కేజీల విభాగంలో కె.గౌరీశంకర్ (శ్రీకాకుళం), ఎల్.దుర్గాప్రసాద్, బి.లక్ష్మణరావు (తూర్పు గోదావరి), పి.రాజ్‌దేవ్ (శ్రీకాకుళం), ఎం.చంద్రమౌళి (విజయనగరం)లు వరుస ఐదు స్థానాల్లోను, 70 కేజీల విభాగంలో ఎం.సాయిదీపక్ (విజయనగరం), టి.మహీంద్ర (తూర్పుగోదావరి), బి.చంద్రశేఖర్, వై.వినయ్‌కుమార్, కె.అంజి (విజయనగరం)లు వరుస స్థానాలు దక్కించుకున్నారు. అలాగే 75 కేజీల విభాగంలో ఎన్.రవికుమార్ (గుంటూరు), ఎన్.భాస్కర్ (శ్రీకాకుళం), జె.రవితేజ, ఎస్.కిరణ్‌కుమార్, వి.బాలకృష్ణ(విజయనగరం)లు వరుస ఐదు స్థానాల్లో నిలిచారు. 80 కేజీల విభాగంలో ఎస్.రమేష్ (తూర్పుగోదావరి), కె.భార్గవ్‌రామ్, కె.బాలాజీ, జి.రాఘవ (విజయనగరం), జె.గణేష్ (శ్రీకాకుళం)లు వరుస స్థానాల్లో నిలిచారు. 85కేజీల విభాగంలో ఎస్.శ్రీనివాసరావు (విజయనగరం), బి.రోహిత్ (తూర్పుగోదావరి), వి.వంశీకృష్ణ ( విశాఖపట్నం)లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. మెన్ ఫిజిక్ విభాగంలో కె.బాలాజీ(విజయనగరం), వి.మహేష్ (శ్రీకాకుళం), ఎల్.దుర్గాప్రసాద్ (తూర్పు గోదావరి), ఎస్.వంశీమెహర్(విశాఖపట్నం), ఇబ్రహిమ్ షేక్ (శ్రీకాకుళం)లు వరుస ఐదు స్థానాల్లో నిలిచారు. మాస్టర్స్ విభాగంలో బి.చంద్రశేఖర్ (విజయనగరం), షేక్ ఇనూష్ (తూర్పుగోదావరి), పి.అప్పారావు (విజయనగరం), కె.రామినాయుడు (విశాఖపట్నం), ఎ.భాస్కర్ (శ్రీకాకుళం)లు వరుస స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ చాంపియన్‌గా గుంటూరుకు చెందిన ఎన్.రవికుమార్ నిలిచారని పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. విజేతలకు షీల్డ్‌లతోపాటు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, సౌత్ సెంట్రల్ రైల్వే మిస్టర్ ఇండియా చాంపియన్ భాస్కరన్, ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ కార్యదర్శి ఎన్.కృష్ణ పాల్గొన్నారు.
11 జిల్లాల నుంచి పాల్గొన్న 90 మంది
క్రీడాకారులు