
ప్రతిభ నిరూపించుకునే వేదిక
విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బి మంచి వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో పట్టు సాధించాలనుకునే విద్యార్ధులకు ఇటువంటి పోటీ పరీక్షలు ఉపయోగపడతాయి. పరీక్షలో ఎన్నో కొత్త పదాలు, వాక్యాలు నేర్చుకున్నాం. భవిష్యత్‌లో ఎటువంటి పోటీ పరీక్షకు వెళ్లినా సులభంగా అర్థం చేసుకుని రాయగలమన్న నమ్మకం వచ్చింది.
– ఎం.హర్షిణి, 8 వ తరగతి విద్యార్థిని