చికెన్
రాజాం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి గణిత టాలెంట్ టెస్టు నిర్వహించారు. సిక్కోలు గణిత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ పరీక్షకు మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు అర్హత సాధించినట్లు గణితవేదిక సభ్యులు తెలిపారు. గణిత మేధావి శ్రీనివాసరామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈపరీక్షకు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష అనంతరం వారందరికీ నిర్వాహకులు జ్ఞాపికలు అందించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు రెండురోజుల్లో ప్రకటిస్తామని, ఈనెల 17న జిల్లా కేంద్రాల్లో డీఈఓల చేతులుమీదుగా జిల్లా విజేతలకు బహుమతులు అందజేయనున్నామన్నారు. ఈ పరీక్షలకు సెంటర్ అబ్జర్వర్‌గా కె.హేమంత్‌కుమార్, నిర్వాహకులు గణిత వేదిక ప్రతినిధులు ఎస్.హుస్సేన్, కె.కృష్ణంరాజు, శివకుమార్‌లు వ్యవహరించగా, గణిత ఉపాధ్యాయులు వై. ఆదినారాయణ, ఎల్.గోవిందరావు, జీవీ రమణ, నాగరాజు, అప్పలరాజు, బి.సూరిబాబు పాల్గొన్నారు.
బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్ లెస్
శ్రీ95 శ్రీ160 శ్రీ170