
పార్వతీపురం: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పార్వతీపురం అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం బొడ్డమాను గ్రామానికి చెందిన కె. జనార్దన్, వి.అఖిల్, పి.రాములు ద్విచక్రవాహనంపై రాయగడ నుంచి జంఝావతి జంక్షన్ మీదుగా బొడ్డమాను గ్రామం వస్తుండగా రాజ్యలక్ష్మీపురం, కోనవలస గ్రామాల మధ్య మలుపులో ఆదివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.
చెట్టుపై నుంచి జారి పడి మహిళకు..
కొమరాడ మండలం సుంకేసు గ్రామంలో ఆదివారం సాయంత్రం జీడిపిక్కలు ఏరేందుకు వెళ్లిన ఎం.లక్ష్మి ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడి గాయాల పాలైంది. వెంటనే కుటుంబసభ్యులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి ఆటోలో తరలించగా చికిత్స పొందుతోంది.

చికిత్స పొందుతున్న లక్ష్మి