
వేపాద: అప్పలనాయుడు మృతదేహం
వేపాడ: మండలంలోని భర్తవానిపాలెం గ్రామానికి చెందిన పిల్లా అప్పలనాయుడు (48) విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అప్పలనాయుడు ప్రస్తుతం విశాఖలో ఉంటున్నాడు. కొత్తఅమావాస్య సందర్భంగా మంగళవారం స్వస్థలానికి వచ్చి తిరిగి గ్రామం నుంచి మరో వ్యక్తిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా బల్లంకి వెళ్లే మలుపువద్ద బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో బైక్ నడుపుతున్న అప్పలనాయుడు తలకు గాయం కాగా విశాఖ తరలించి ఆపరేషన్ చేయించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు వల్లంపూడి ఏఎస్సై గోపీకృష్ణ చెప్పారు.
పిడుగుపాటుతో ఒకరు...
జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపడి వన్నెల సింహాచలం (60) మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఎప్పటిలాగానే పశువులను నాగావళి నది ఒడ్డుకు మేతకు తీసుకువెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు బాబు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి.
రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి..
గజపతినగరం: గజపతినగరం రైల్వే స్టేషన్ యార్డులో రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి (27)మృతి చెందాడు. సోమవారం తెల్లవారు జామున 3గంటలకు జరిగిన ఈ సంఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి దివ్యాంగుడని, రైలు నుంచి జారి పడి ఉండవచ్చన్నారు. మృతుడి ఎడమ చేతిపైన దివ్య అనే పేరుతో పచ్చ బొట్టు ఉందని అదే చేతి పైన ఇంగ్లీష్ అక్షరాలు పచ్చబొట్టుతో విడివిడిగా ఉన్నాయని చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9666555214,9441013330 నంబర్లను సంప్రదించాలని కోరారు.

గజపతినగరం: మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
![hĶæ$Å-Ð]l$Ã-Ð]l-ÌSçÜ: íÜ…à-^èlÌS… మృÐ]l$–™èl§ólçßæ…2](/gallery_images/2023/03/28/27krp42a-370018_mr.jpg)
hĶæ$Å-Ð]l$Ã-Ð]l-ÌSçÜ: íÜ…à-^èlÌS… మృÐ]l$–™èl§ólçßæ…