
బొబ్బిలి: పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఐదురోజుల పాటు రాజస్థాన్‌లో జరిగే ఈ పోటీల్లో సబ్ జూనియర్ విభా గంలో జి చరిత, బి.యశస్విని, క్యాడెట్ విభా గంలో జి జాహ్నవి పాల్గొంటారని చెప్పారు.
ఇసుక లారీ బోల్తా
దత్తిరాజేరు: మండలంలోని గడసాం సమీపంలో సోమవారం తెల్లవారు జామున బీటి రోడ్డుపై అదుపు తప్పి ఇసుక లారీ బోల్తా పడినట్లు పెదమానాపురం ఎస్సై బి.భాగ్యం తెలిపారు. ఒడిశా నుంచి అన్ని అనుమతులతో వైజాగ్ వెళ్తున్న లారీ వర్షానికి అదుపు తప్పినట్లు చెప్పారు. అయితే అదృష్టవశాత్తు డ్రైవర్,క్లీనర్ క్షేమంగా బయట పడ్డారన్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ
రాజాం సిటీ: స్థానిక చీపురుపల్లి రోడ్డులోని పోలీస్‌స్టేషన్ దారిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత పెనుప్రమాదం తప్పింది. ఇసుకతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం పూర్తిగా విరిగిపోయింది. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఏఎస్సై రమణమ్మ ఘటనపై అప్రమత్తమై లారీ డ్రైవర్, క్లీనర్‌లను పరిశీలించి చిన్నగాయాలతో ఉన్న వారిని సామాజిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ సిబ్బంది పవర్ సప్‌లై నిలిపివేశారు. సోమవారం కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
డస్ట్‌బిన్ పెట్టమన్నందుకు దాడి
పార్వతీపురం: పార్వతీపురం పట్టణం బంధంవారి వీధిలో ఆయుర్వేదిక్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఎస్.వెంకటరమణను, పక్కననున్న స్వీట్‌షాపు యజమాని గౌరీశంకరరావు రాయితో కొట్టి గాయపరిచాడు. వివరాలిలా ఉన్నాయి. స్వీట్ షాప్‌కు వచ్చిన వారు స్వీట్లు తినేసి ఆ చెత్తను తన షాపుముందు పడేస్తున్నారని, దీనివల్ల వ్యాపారానికి ఇబ్బందిగా ఉందని గౌరీశంకరరావును వెంకటరమణ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి వెంకటరమణను రాయితో తలపై బలంగా గౌరీశంకరరావు కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గనించిన స్థానికులు బలరాం, సత్తిబాబులు క్షతగాత్రుడిని ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు. అలాగే ఈఘటనలో గౌరీశంకరరావుకు కూడా కంటి పైభాగంలో దెబ్బతగలడంతో ఆయన కూడా పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొట్టడంతో విరిగిన విద్యుత్ స్తంభం