
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
విజయనగరం: పంజాబ్ రాష్ట్రం పటియాలాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ట్రాక్ సైక్లింగ్ పోటీలకు జిల్లాకు చెందిన డి.గణేష్ ఎంపిక య్యాడు. గణేష్‌ను సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్ రాజు, విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాల రావు అభినందించారు.
కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్షలు
విజయనగరం ఫోర్ట్: రాహుల్‌గాంధీపై అనర్హత వేసు వేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డీసీసీ కార్యాలయం ఎదుట ఆదివారం సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ సంద ర్భంగా డీసీసీ అధ్యక్షుడు రమేష్‌కుమార్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
క్రెడయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చంద్రబోస్
విజయనగరం: క్రెడయ్ చాప్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయనగరం జిల్లాకు చెందిన కాటూ రి సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. విశాఖ లో జరిగిన క్రెడయ్ చాప్టర్ రాష్ట్ర ఎన్నికల్లో 2023 – 25 సంవత్సరాలకు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే క్రెడయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగేళ్లు పాటు సేవలందించిన ఆయన నూతనంగా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాణ రంగంలో సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానన్నారు. నిర్మాణ రంగ కార్మికులకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. బిల్డర్‌ల సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ముందుకు వెళతామని చెప్పారు.
డ్రిప్ ఇరిగేషన్‌తో బహుళ ప్రయోజనాలు
● ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ
విజయనగరం ఫోర్ట్: డ్రిప్ ఇరిగేషన్‌తో ప్రయోజనాలు అనేకమని ఏపీఎంఐపీ పీడీ పీఎన్‌వీ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక అయ్యన్నపే ట గ్రామంలో సీహెచ్ అమ్మాజీ తన కొబ్బరి తోటలో ప్రభుత్వ సహకారంతో వేసిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఆయన ఆదివారం పరి శీలించారు. కొబ్బరిలో అంతర పంటగా కర్బూజా సాగు చేసి రెండింటికి రైతు డ్రిప్ వినియోగించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.

డ్రిప్ ఇరిగేషన్‌ను పరిశీలిస్తున్న లక్ష్మీనారాయణ

గణేష్

కె.సుభాష్‌చంద్రబోస్