విజయనగరం లీగల్: జిల్లాలోని శాశ్వత లోక్ అదాలత్ (ప్లాపస్)లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవల సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణచక్రవర్తి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తొలుత ఏడాది కాలం పాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి, హెడ్ క్లర్క్, స్టెనో కం టైపిస్ట్, టైపిస్ట్ కం అసిస్టెంట్ ఒక్కో పోస్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్ కమ్ ఆఫీస్ సబార్డినెట్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసే విధానం, అర్హతలు, రిజర్వేషన్, ఎంపిక విధానం తదితర ఇతర వివరాలకు కార్యాలయంలో గానీ, లేదా http://district.ecourt.gov.in/ vizianagaram వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించాలని సూచించారు.