పక్కా ప్రణాళికతో లక్ష్య సాధన | - | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో లక్ష్య సాధన

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

మహారాణిపేట: జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వార్డుల మ్యాపింగ్‌, మన మిత్ర శిక్షణ, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేలో మిస్సింగ్‌ వివరాల నమోదు, మత్స్యకార లబ్ధిదారుల ఈ–కేవైసీ తదితర అంశాల పురోగతిని తెలుసుకున్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సేవలు, పీ4– బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యో గ మేళాల నిర్వహణ, ఆధార్‌ ప్రత్యేక శిబిరాల ఏర్పా టు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు పర్యవేక్షణతో పాటు ఏపీ సేవా సేవలు, ఫీల్డ్‌ పెండెన్సీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామం సేవలను విస్తృతం చేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. పౌరుల ఈ–కేవైసీ ప్రక్రియను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల వార్డుల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, గాజువాకలో అధిక పెండింగ్‌ ఉండటంపై సంబంధిత జోనల్‌ కమిషనర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కౌశలం కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సచివాలయాలకు నేమ్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని, ఎవరైనా సచివాలయాలను తనిఖీ చేస్తే తనకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లా స్వర్ణగ్రామ–స్వర్ణవార్డు అధికారి పూర్ణిమాదేవి, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ సత్యవేణి, డీడీవో ఉషారాణి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ప్రత్యక్షంగా పాల్గొనగా, అన్ని జోనల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు వర్చువల్‌గా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement