వేసవి భానుడి భగభగలకు విరుగుడుగా చిన్నారులు జలకాలాటల్లో మునిగితేలుతున్నారు. నీలి రంగు నీటి అలలపై తమ సాహస విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. నిలకడగా ఉన్న పడవ అంచునే వేదికగా చేసుకుని, గాల్లో గంతేస్తూ.. విల్లులా వొంకరలు తిరుగుతూ నీటిలోకి దూకుతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎండ వేడిని మర్చిపోయి, కేరింతల మధ్య సాగుతున్న ఈ చిచ్చరపిడుగుల విన్యాసాలు తీర ప్రాంతంలో సందడిని నింపుతున్నాయి. పడవ ఇంజిన్‌పై నుంచి గాల్లోకి ఎగురుతూ వారు చేస్తున్న జల విన్యాసాలు సాహసానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి.
– ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


