● ఆసరాగా అడుగులు.. నమ్మకమే వెలుగులు | - | Sakshi
Sakshi News home page

● ఆసరాగా అడుగులు.. నమ్మకమే వెలుగులు

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

నురెప్పల వెనుక కాంతి లేకపోతేనేం... గుండె లోతుల్లో నమ్మకపు దీపం వెలుగుతుంటే! గమ్యం చేరడానికి దారి చూపించే కళ్లు లేకున్నా.. చేయి విడవని తోడు, గుండె నిండిన ధైర్యమే వీరి బలం! ఈ లోకం వీరికి కనిపించకపోవచ్చు.. కానీ ఒకరి స్పర్శ మరొకరికి కొండంత అండ. చీకటి తెరలను చీల్చుకుంటూ సాగుతున్న ఈ అడుగులు.. మనుషుల మధ్య ఉండాల్సిన మమకారానికి మౌన భాష్యమని స్పష్టం చేస్తున్నాయి. వన్‌టౌన్‌ పాత పోస్టాఫీసు ప్రాంతంలో ఒకరికొకరు ఆసరాగా నిలిచిన ఈ దృశ్యం, చూపు లేకున్నా నమ్మకంతో గమ్యాన్ని ముద్దాడవచ్చని చాటిచెబుతోంది. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement