15 నుంచి ‘వైఎస్సార్‌ సీపీ ఎంఏపీఎల్‌’ క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

15 నుంచి ‘వైఎస్సార్‌ సీపీ ఎంఏపీఎల్‌’ క్రికెట్‌ టోర్నీ

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

మహారాణిపేట: వైఎస్సార్‌ సీపీ మొల్లి అప్పారావు ప్రీమియర్‌ లీగ్‌(ఎంఏపీఎల్‌) క్రికెట్‌ పోటీలు ఈ నెల 15 నుంచి 18వ తేదీ నిర్వహించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల పోస్టర్‌ను సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్‌ సీపీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు జన్మదినం పురస్కరించుకుని.. 10వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కంటుబోతు తులసీరాం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణి కుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీ రామచంద్రరావు, జోనల్‌ అధ్యక్షుడు అంబటి శైలేష్‌, సునీల్‌, 10వ వార్డు అధ్యక్షుడు పతివాడ కనకరాజు పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కాగితాల రవికిరణ్‌ రెడ్డి, నాయకులు కె.కన్నబాబు, దంతిన రామా రావు, చొల్లంగి నాగేశ్వరరావు, మెట్ట సూర్యనారాయణ, మీసాల ప్రదీప్‌, రవీంద్ర చౌదరి, శశికుమార్‌, రౌతు సంతోష్‌, మాచర్ల రవి, గోవింద్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement