జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 82 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు మొత్తం 82 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య హాజరై నగర ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 49 ఫిర్యాదులు అందాయి. మిగిలిన వాటిలో రెవెన్యూ విభాగానికి 12, జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 7, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 7, ప్రజారోగ్య విభాగానికి 3, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 2, హార్టికల్చర్ విభాగానికి ఒకటి, యూసీడీ విభాగానికి ఒకటి చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(అమృత్) డి.విజయభారతి, ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.


