శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

కొమ్మాది: తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం స్వామివారికి అలంకరించే మేల్చాట్‌ (పట్టు) వస్త్రాన్ని సమర్పించే అరుదైన అవకాశాన్ని రుషికొండలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కల్పిస్తోంది. భక్తుల కోరిక మేరకు ఈ సువర్ణ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి పట్టు వస్త్రాన్ని అందించే భక్తుల పేరున ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సేవలో పాల్గొనాలని ఆకాంక్షించే భక్తులు ముందుగా 9866397593, 8074404845 నంబర్లను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement