పెందుర్తి: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి అతని కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి పాతూరులో నివాసం ఉంటున్న పెతకంశెట్టి రాము(46) శనివారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. వెంటనే భార్య సత్యవతి, కుమారుడు త్రినాథ్, బావమరిది శరగడం సంతోష్ నేత్రదానానికి ఒప్పుకుని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ చేతుల మీదుగా అంగీకార పత్రం అందించారు. మొహిసిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, లక్ష్మి మృతుని నేత్రాలను సేకరించారు.


